నవ నందికి వందనం – ప్రకాష్ రాజ్

నవ నందికి వందనం – ప్రకాష్ రాజ్

Published on Oct 13, 2012 6:09 PM IST


ఈ రోజు ప్రకటించిన 2011 నంది అవార్డ్స్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి మరో నంది అవార్డు దక్కింది. దూకుడు సినిమాలో మహేష్ బాబు తండ్రి శంకర్ నారాయణ పాత్రకు గానే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ అవార్డుతో అయన మొత్తం 9 నంది అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డు ప్రకటించిన వెంటనే దబాంగ్ 2 షూటింగ్లో ఉన్న అయన మాట్లాడుతూ ‘నాకిది 9 వ నంది అవార్డు. ఈ అవార్డుకు కమిటీకి ధన్యవాదాలు. అలాగే దూకుడు టీం సభ్యులకి, నంది అవార్డు గ్రహీతలందరికీ అభినందనలు’ అంటూ తెలియజేసారు. విలక్షణ నటుడు అయిన ప్రకాష్ రాజ్ కి ఇలాంటి అవార్డులు కొత్తేమి కాదు.

తాజా వార్తలు