బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రదీప్ సెన్సేషన్

తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. ఆయన నటించిన ‘లవ్ టుడే’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇక రీసెంట్‌గా ఆయన నటించిన ‘డ్రాగన్’ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. యూత్ మెచ్చే చిత్రాలతో ప్రదీప్ తన సత్తా చాటుతున్నాడు.

ఇక ఆయన ఇదే స్ట్రాటెజీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(LIK)లో నటిస్తున్న ప్రదీప్, మరో చిత్రం ‘డ్యూడ్’లో కూడా నటిస్తున్నాడు. LIK చిత్రంలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

అటు ‘డ్యూడ్’ సినిమాను కీర్తిశ్వరణ్ డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. నెల రోజుల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలతో ప్రదీప్ తన సక్సె్స్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Exit mobile version