నాకు గుర్తింపుకు కారణం చిరంజీవే – ప్రభుదేవా

prabhu-deva

సీనియర్ నటుడు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ టాక్ షోకి కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా అతిథిగా హాజరయ్యారు. ఈ షోలో ప్రభుదేవా తన బాల్యం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇంతకీ, ప్రభుదేవా ఏం మాట్లాడారు అంటే.. ‘నాకు హిప్‌ అప్‌, బ్రేక్‌ డ్యాన్స్‌.. ఇలా రకరకాల డ్యాన్స్‌లు నిజంగా నాకు పెద్దగా తెలియవు. అయితే, మరి నాకు తెలిసింది ఏంటి ?, నా డ్యాన్స్‌ మాత్రమే. నాకు వచ్చిన ఆ డ్యాన్స్ నే ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తాను’ అని ప్రభుదేవా తెలిపారు.

ప్రభుదేవా ఇంకా మాట్లాడుతూ.. ‘నాతో పాటు మా వంశంలో చాలామంది డ్యాన్సర్లు ఉన్నారు. నాకు ఇండస్ట్రీలో చిరంజీవి ఆదర్శం. ఆయన చాలా కష్టపడతారు. ‘అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు’ సినిమాలో మెరుపులా.. సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించాను. అప్పుడు ఆయన డ్యాన్స్‌ మూమెంట్స్‌ చూసి నాకు నేనే ఆశ్చర్యపోయాను. ఒకవిధంగా నాకు ఈరోజు ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి ముఖ్య కారణం చిరంజీవే. టాలెంట్‌ ఉంటే ఆయన కచ్చితంగా ప్రోత్సహిస్తారు. అలాగే నన్ను ఆయన ప్రోత్సహించారు’ అని ప్రభుదేవా చెప్పుకొచ్చారు.

Exit mobile version