‘కాంతార : చాప్టర్ 1’ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడటంపై తెలుగు ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ ప్రమోషన్ సందర్భంగా ఆయన తన స్పీచ్‌ను కన్నడలో ఇవ్వడం వివాదానికి దారి తీసింది.
అయితే, ఈ వివాదంపై రిషబ్ శెట్టి తాజాగా ఓ కార్యక్రమంలో స్పందించారు. “నేను ఎక్కువగా కన్నడలో ఆలోచిస్తాను కాబట్టి సహజంగానే ఆ భాషలో మాట్లాడతాను. కానీ ప్రతి భాషను గౌరవిస్తాను. ఎక్కడికైనా వెళితే అక్కడి భాషకు గౌరవం ఇవ్వడం అవసరం. కొన్నిసార్లు అది తప్పుగా ప్రెజెంట్ అవుతుంది. నేను కన్నడిగ అని చెప్పుకునేందుకు గర్వపడతాను. కానీ అన్ని భాషల పట్ల సమాన గౌరవం ఇస్తాను. ఇకపై ఇతర భాషల్లో మాట్లాడేందుకు తప్పక ప్రయత్నిస్తాను” అని రిషబ్ చెప్పుకొచ్చాడు.
మరి రిషబ్ ఇచ్చిన వివరణపై తెలుగు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.