ఫోటో మూమెంట్ : తన జీవితభాగస్వామికి స్పెషల్ బర్త్‌డే విషెస్ చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu-arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బ్యూటీఫుల్ ఫోటోను షేర్ చేస్తూ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ అందమైన జంట ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“హ్యాపీ బర్త్‌డే క్యూటీ” అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చాడు బన్నీ. ఇక ఈ పోస్ట్‌కు లక్షల లైకులు, వేలాది కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫోటోలో అల్లు అర్జున్-స్నేహ రెడ్డి ఫ్యాషన్ స్టైల్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక సినిమాల విషయంలో అల్లు అర్జున్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సై-ఫై ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాడు. దీపిక పదుకొణే మరో లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Exit mobile version