ట్విట్టర్లో ప్రభుదేవా

ట్విట్టర్లో ప్రభుదేవా

Published on Jul 17, 2012 4:45 PM IST


ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న డాన్సర్ ప్రభుదేవాని కూడా ట్విట్టర్ వైరస్ కరిచినట్టుంది. కాళ్ళలో ఎముకలు బదులు రబ్బర్లు ఉన్నట్టుగా డాన్సులు వేసే ప్రభుదేవా ట్విట్టర్ లోకి అడుగుపెట్టాడు. ట్విట్టర్లో ప్రభుదేవా ఐడి @PDdancing. ఇప్పటికే సోనాక్షి సిన్హా, హన్సిక మరియు మొదలైన సెలబ్రిటీలు ఈ ప్రముఖ డాన్సర్ కి ట్విట్టర్లో స్వాగతం పలికారు.

ప్రస్తుతం ప్రభుదేవా సూపర్ హిట్ డైరెక్టర్ గా వెలుగొందుతున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘రౌడీ రాథోర్’ ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డులను నెలకొల్పింది. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రభుదేవా మరింత సంతోషకరంగా ఉండాలని కోరుకుందాం. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ప్రభుదేవాని ఫాలో అయ్యి డాన్సుకి సంభందించిన మెళకువలు అడిగి తెలుసుకోండి.

తాజా వార్తలు