తెన్ కాశిలో బిజీగా ఉన్న ప్రభాస్

తెన్ కాశిలో బిజీగా ఉన్న ప్రభాస్

Published on Nov 7, 2012 6:54 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘మిర్చి’ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని టెన్ కాశీలో జరుపుకుంటోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా మాటల రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయలతో ఆడి పాడుతున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరి వారంలో కానీ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వంశీ కృష్ణా రెడ్డి మరియు ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ చాలా స్టైలిష్ గా ఉన్నారు.

తాజా వార్తలు