100 రోజులు పూర్తి చేసుకున్న మిర్చి

100 రోజులు పూర్తి చేసుకున్న మిర్చి

Published on May 16, 2013 4:13 PM IST

Mirchi2

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గానిలిచింది. ఈ రోజుతో మిర్చి 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో 100 రోజులు ప్రదర్శించడం అనేది చాలా రేర్ గా జరుగుతోంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలిపిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ సినిమా 28 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాకి ప్రభాస్ గ్లామర్, మాచో లుక్ పెద్ద హైలైట్ అయ్యింది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరో హైలైట్ అయ్యింది.

యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. ప్రభాస్ సరసన అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్ గా జోడీ కట్టారు.

తాజా వార్తలు