ప్రభాస్ తో కలిసి “ఏక్ నిరంజన్” చిత్రంలో కనిపించిన పొడుగుకాళ్ల సుందరి కంగనా రనౌత్ మొదటిసారిగా దర్శకత్వం చేపట్టారు. ఆస్ట్రేలియన్ రచయిత మరియు అమెరికన్ బృందంతో కలిసి ఈ భామ ఒక లఘు చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ లఘు చిత్రం మొత్తం ఒక అబ్బాయి మరియు కుక్క చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శిస్తారు. కంగనా ఈ చిత్రం గురించి చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నారు ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏక నిరంజన్ చిత్రం తరువాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కంగనా తీసిన లఘు చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు.