ప్రభాస్ ‘ఓ డియర్’.. సింగిల్ షాట్ కి రెండు కోట్లే !

ప్రభాస్ ‘ఓ డియర్’.. సింగిల్ షాట్ కి రెండు కోట్లే !

Published on Mar 12, 2020 12:22 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న చిత్రం ప్రస్తుతం శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. కేవలం ఒక్క షాట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఇటీవల జరిగిన జార్జియా షెడ్యూల్ లో ఈ షాట్ తీసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ షాట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భారీ ఛేజ్ సీన్ మొత్తాన్ని ఒకే ఒక్క షాట్‌లో తీశారు. ఈ చేజింగ్ సీన్ కోసం ఇంటర్నేషనల్ క్రూ కూడా వర్క్ చేశారు. ఇక త్వరలో యూరప్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ ఎక్కువ రోజులే జరగనుంది.

కాగా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదించనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రంలో యాక్షన్ మాత్రమే కాకుండా మంచి రొమాంటిక్ కంటెంట్ కూడా ఉండనుంది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే పేరుతో పాటు ‘ఓ డియర్, రాధేశ్యామ్’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

తాజా వార్తలు