పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి హారర్ కామెడీ జోనర్లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాతో ప్రభాస్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ముఖ్యంగా రాజా సాబ్ చిత్రంతో తన అభిమానుల ఆకలి తీర్చేందుకు ఆయన కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే డ్యాన్స్ కూడా ప్రభాస్ నుంచి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ పెప్పీ డ్యాన్స్ నెంబర్ ఉందని.. దీనిలో ప్రభాస్‌ను మునుపెన్నడూ చూడని డ్యాన్స్ చేస్తూ చూస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ పరంగా కూడా ప్రేక్షకులను అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 9, 2026 న రిలీజ్ కానుంది.