పవన్, మహేష్ రికార్డులను ప్రభాస్ బద్దలు కొట్టేస్తాడేమో !

పవన్, మహేష్ రికార్డులను ప్రభాస్ బద్దలు కొట్టేస్తాడేమో !

Published on Oct 2, 2020 2:53 AM IST


రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ సామాజిక మధ్యమాల్లో విపరీతంగా పెరుగిపోతోంది. ఆయన ఫేస్ బుక్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరగా, ఇన్స్టా ఖాతాలో 5.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇక ట్విట్టర్లో అయితే ప్రభాస్‌కు అకౌంట్ లేకపోయినా నిత్యం అయన గురించిన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇందుకు కారణం పాన్ ఇండియా లెవల్లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్. ఇన్నాళ్లు దక్షిణాదిన సోషల్ మీడియా రికార్డులు, ముఖ్యంగా ట్విట్టర్ రికార్డ్స్ అంటే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అజిత్, విజయ్ మాత్రమే ఉండేవారు. తెలుగులో అయితే పవన్, మహేష్ బాబు అంతే.

అభిమానులు పవన్, మహేష్ బాబుల పుట్టినరోజునాడు 40 మిలియన్లు, 50 మిలియన్లు, 60 మిలియన్ల ట్వీట్లు అంటూ పనిగట్టుకుని మరీ వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. మొన్నామధ్యన పవన్ పుట్టినరోజుకు ఆయన అభిమానులు ఏకంగా 65 మిలియన్లకు పైగా ట్వీట్లు వేసి భారీ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. అంతకుముందు మహేష్ పేరు మీద కూడ చాలానే ట్విట్టర్ రికార్డులు ఉన్నాయి. ప్రభాస్ సోషల్ మీడియా ఫాలోయింగ్ చూడబోతే ఈ రికార్డులన్నీ బద్దలయ్యేలా ఉన్నాయి.

ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. ఆరోజున సోషల్ మీడియాలో పెద్ద హడావుడే ఉండనుంది. ఎందుకంటే ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న క్రేజీ సినిమాల అప్డేట్స్ అన్నీ ఆరోజునే రానున్నాయి. ప్రజెంట్ షూటింగ్లో ఉన్న డార్లింగ్ చిత్రం ‘రాధే శ్యామ్’ మోషన్ పోస్టర్ 23నాడే విడుదలకానుంది. అలాగే ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ నటీనటుల పూర్తి వివరాలు, నాగ్ అశ్విన్ తో చేయనున్న భారీ బడ్జెట్ సినిమా టైటిల్ అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తాడని చెబుతున్న మూవీ ఆఫీషియల్ కన్ఫర్మేషన్ అన్నీ అదే రోజున రానున్నాయి. అంటే ఆరోజు మొత్తం సామాజిక మాధ్యమాల్లో ప్రభాస్ హడావిడే ఉంటుందన్నమాట. కాబట్టి ఇన్నాళ్లు పవన్, మహేష్ బాబుల పేర్ల మీదున్న ట్విట్టర్ రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

తాజా వార్తలు