యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘వారధి’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మరియు సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కోసం వాడిన ఇంటి సెట్లో చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ సరసన అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు.
ప్రమోద్ ఉప్పలపాటి వంశికృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో కొన్ని చిత్రాలు డైలాగులు రాసిన కొరటాల శివ దర్శకుడిగా మారి ఈ చిత్రానికి పనిచేయబోతున్నారు.