నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్రకటించి.. ఆ సినిమా షూటింగ్ కోసం డిసెంబర్ లో డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడట. సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడని.. అందుకే ప్రభాస్ ప్రస్తుతం తన బాడీని పెంచే సన్నాహాల్లో ఉన్నాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా స్టోరీకి సంబంధించి.. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ గాసిప్ ఏమిటంటే.. ఈ సినిమాలో ప్రభాస్ మూడు పాత్రలలో కనిపించబోతున్నాడట. మొత్తానికి ఓ సోషియో ఫాంటసీ ఎలిమెంట్ ని తీసుకుని.. సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలకమైన సీక్వెన్స్ లో రామాయణంకి సంబంధించిన ఒక ఎపిసోడ్ ను కూడా పెడతారట.
కాగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో ఇలాంటి భారీ సినిమాను చేయకుండా, సౌత్ హీరో అయిన ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే. అన్నట్టు ఈ సినిమాని 3డి విజువల్ గ్రాఫిక్స్ తో ఒక మహదాద్భుతంగా తెరకెక్కించి దేశంలోని అన్ని భాషలతో పాటు విదేశాల్లోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.