మల్టీవర్స్‌లో రాబోతున్న రాజా సాబ్.. ఇది కదా కావాల్సింది..!

The-Raja-Saab-Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ సినిమాను పలు కారణాలతో రిలీజ్ డేట్ వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తొలుత ఈ సినిమాను ఒకే సినిమాగా రూపొందించాలని మేకర్స్ భావించారట. ఈ సినిమాను ఫస్ట్ భాగంగానైనా సమయానికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఈ సినిమా కోసం అనుకున్న నిడివి ఎక్కువకావడంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేదట. దీంతో ఈ సినిమాను ఫ్రాంచైజీల రూపంలో పలుమార్లు రిలీజ్ చేయొచ్చని మేకర్స్ భావిస్తున్నారట.

మరి ఈ నిర్ణయానికి ప్రభాస్ ఒప్పుకుంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ సర్‌ప్రైజ్ ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది.

Exit mobile version