యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. బాహుబలి తరువాత ఆయన ఇమేజ్ ఇండియా మొత్తం పాకింది. దీనితో ఆయన భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీనితో సినిమాల మధ్య గ్యాప్ రెండేళ్ల వరకు ఉంటుంది. 2017లో బాహుబలి 2 విడుదల కాగా, సాహో విడుదల కావడాన్ని రెండేళ్లకు పైనే సమయం పట్టింది. సాహో తరువాత త్వరత్వరగా సినిమాలు చేస్తానని చెప్పిన ప్రభాస్ రాధా కృష్ణ మూవీ కూడా చిన్నగా పూర్తి చేస్తున్నారు. ఈ మూవీ 2020 చివర్లో వచ్చే అవకాశం ఉంది.
ఇక నాగ్ అశ్విన్ తో ఆయన మరో భారీ చిత్రాన్ని కమిట్ అయ్యారు. ఈ మూవీ 2020 అక్టోబర్ లో మొదలై 2022 సమ్మర్ కి విడుదల చేస్తాం అని నిర్మాత అశ్వినీ దత్ చెప్పారు. కాబట్టి 2021లో ప్రభాస్ నుండి మరో చిత్రం ఉండదు. అలాగే మరో రెండేళ్లు ఆయన నాగ్ అశ్విన్ సినిమా కోసం కేటాయించడం జరిగింది. ఇకపై ప్రభాస్ నుండి ప్రతి ఏటా ఓ మూవీ రావడం కష్టంగానే కనిపిస్తుంది.