నేషనల్ స్టార్ ప్రభాస్ తన సన్నిహితులకు అలాగే తన దగ్గర పనిచేస్తున్నవారికి అప్పుడపుడు సర్ ప్రైజ్ గిప్ట్ లు ఇస్తుంటాడు. తాజాగా తన ఫిట్ నెస్ ట్రైనర్ లక్ష్మణ్ కు ప్రభాస్ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రభాస్ గిఫ్ట్ కు లక్ష్మణ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇక ప్రభాస్ వద్ద ఎప్పట్నుంచో ఫిట్‌నెస్ ట్రైనర్‌గా లక్ష్మణ్ పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘రాధే శ్యామ్’ సినిమాలో జరుగుతుంది. కాగా రివేంజ్ స్టోరీతో సాగే ఓ థ్రిల్లింగ్ ప్రేమకథగా రానున్న ఈ సినిమా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరుపుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ అక్కడ షూట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో అక్టోబర్ నుండి షూట్ చేయనున్నారు. కాగా మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.