ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ కావాల్సిందేనట.!

ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రీట్ కావాల్సిందేనట.!

Published on Oct 11, 2020 2:02 AM IST


ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ స్వచ్ఛమైన ప్రేమ కావ్యం కోసం ప్రభాస్ అభిమానులు ఎన్నడూ లేని విధంగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లోనే ప్రభాస్ పుట్టిన రోజు వస్తుండే సరికి దాదాపు పూర్తి కావచ్చిన ఈ సినిమా అప్డేట్ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. మిగతా చిత్రాలు అంటే జస్ట్ ఏవైనా అనౌన్సమెంట్స్ ఉంటాయేమో కానీ “రాధే శ్యామ్” విషయంలో మాత్రం అంతకు మించే కోరుకుంటున్నారు.

సోషల్ మీడియాలో అయితే అభ్యర్ధనలు, డిమాండ్లు మేకర్స్ మీదకు వెల్లువెత్తుతున్నాయి.అయితే ఇప్పటికే టీం ఆల్రెడీ ఒక ప్లాన్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ పుట్టినరోజుకు ఖచ్చితంగా రాధే శ్యామ్ టీం నుంచి ట్రీట్ ఉంది.

అందుకే ఇపుడు అప్పుడే అనౌన్స్ చెయ్యకపోయినా కాస్త పుట్టినరోజుకు ముందు అనౌన్స్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంటుందని మేకర్స్ ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండి ఉండొచ్చు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు