ఇప్పుడు మన దేశీయ సినిమా మార్కెట్ లోనే ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ లా మారిపోయింది. మరి ఒక బ్రాండ్ అంటే ఊరికినే అయ్యిపోతారా? వెనుక ఎంతో కఠోర శిక్షణ తెగింపు ఉంటేనే తప్ప. అలాంటివి ఎన్నో చేసినా సరే చిరునవ్వుతోనే ఎప్పుడూ కనిపిస్తాడు డార్లింగ్ ప్రభాస్. ఒక స్టార్ హీరో స్టేజ్ లో ఉన్నప్పుడు కేవలం ఒక సినిమాకే ఐదేళ్ల పాటు డేట్స్ ఇచ్చేయడం అనేది సాధారణ విషయమేమి కాదు.
అందుకే తనపై తాను పెట్టుకున్న నమ్మకమే ఇప్పుడు ప్రభాస్ ను ఈ రేంజ్ లో నిలబెట్టింది. బాహుబలి ఒక్క సినిమాతో ప్రభాస్ డెడికేషన్ కు అర్ధంలా నిలిచారు. అయితే ఇప్పుడు ప్రభాస్ మరోసారి తన డెడికేషన్ ను నిరూపించుకోనున్నారు. ఇప్పుడు చేస్తున్న మూడు భారీ ప్రాజెక్టులలో బాలీవుడ్ ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కూడా ఒకటి. ఈ చిత్రంలో రామునిగా ప్రభాస్ నటించనున్నాడన్న సంగతి తెలిసిందే.
అలాగే ఈ చిత్రం కోసం మళ్ళీ బిల్లా, బాహుబలి తర్వాత విల్లును పట్టుకోనున్నాడు. అందుకే ఈసారి గట్టి ట్రైనింగే తీసుకోనున్నారని తెలిసింది. అది కూడా ఇపుడు ఎంతలా అంటే తన ఇంటి దగ్గరకే అందుకు సంబంధించి సామాగ్రి అంతటిని తెప్పించుకుంటున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ప్రభాస్ డెడికేషన్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి.