ప్రభాస్ బాహుబలిగా రానున్నాడా?

Prabhas

టాలీవుడ్ సూపర్ హిట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పేరు బాహుబలి అనే వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి అంటే స్ట్రాంగ్ అని అర్థం, ప్రభాస్ పర్సనాలిటీకి ఈ పేరు బాగా సరిపోతుంది. ఎస్.స రాజమౌళి భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో రానా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు అని సమాచారం.

ఈ సినిమా కాకుండా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి మొదట్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version