“శ్రీ సీతారాముల కల్యాణం చూద్దాం రారండి’, ‘అన్నయ్య’, ‘ప్రేమ కోసం’, ‘శివరామరాజు’, ఓజీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో వెంకట్ ఇప్పుడు మరోసారి సినిమాల్లోకి గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ‘ఓం హరుడు’ అనే మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తున్నాడు.
రాజ్ తాళ్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వీఆర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్‌కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రభంజనం’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. విశ్వ వేమూరి స్వయంగా రాసి, స్వరపరచి, పాడిన ఈ పాట పవర్‌ఫుల్ బీట్‌లతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాలో హెబ్బా పటేల్, సలోని, శ్రీహరి పైల, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద్ మారుకుర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు ఉప్పు మారుతీ ఎడిటింగ్ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
