‘చికిరి చికిరి’.. మరో ట్విస్ట్ రివీల్ చేసిన పెద్ది మేకర్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ నుండి ‘చికిరి చికిరి’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ‘చికిరి చికిరి’ అనే పాటను లిరికల్ సాంగ్‌గా రిలీజ్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ, తాజాగా ఈ విషయంపై నిర్మాతలు ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇది లిరికల్ సాంగ్ కాదని.. వీడియో సాంగ్ అని వారు తెలిపారు.

దీంతో ఈ పాటలో రామ్ చరణ్ ఎలాంటి స్టెప్పులు వేస్తాడా.. ఈ పాటను ఎంత అందంగా చిత్రీకరించారా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నవంబర్ 7న ఉదయం 11.07 గంటలకు ఈ పాటను రిలీజ్ చేయనున్నారు.

Exit mobile version