ఏప్రిల్ 11 లేదా 18న రానున్న ‘ప్రభంజనం’

Prabanjanam
ప్రస్తుతం మన దేశం, రాష్ట్రంలో నెలకొన్న సామాజిక, ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలో ఉన్న మార్పులకు కారణాలను చెప్పి ప్రజల్లి ఓటుకు ఉన్న వాల్యూని తెలియజెప్పడానికి ఓ నలుగురు కుర్రాళ్ళు చేసిన ప్రయత్నమే ‘ప్రభంజనం’. ‘రంగం’, ‘రచ్చ’ ఫేం అజ్మల్, సందేశ్, పంచి బోర, ఆరుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు భాస్కరరావు వేండాత్రి మాట్లాడుతూ ‘ఓటర్లని ఎడ్యుకేట్ చేసి, సమసమాజ స్థాపన కోసం సివిల్ ఇంజనీరింగ్ చేసిన నలుగురు ఈ కుళ్ళిన రాజకీయాలను ఎలా మార్చారు అనేదే కథ. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను చూపిస్తున్నాం కానీ ఎవరినీ కించపరిచేలా ఉండదు. ఇలాంటి ఓ కథని కథని డాక్యుమెంటరీలా కాకుండా అన్ని కమర్షియల్ హంగులతో నిమించం. ఏప్రిల్ 11 లేదా 18న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని’ తెలిపాడు. ఈ మూవీకి ఆ.పి పట్నాయక్ సంగీతం అందించాడు.

Exit mobile version