దసరాకి అప్ డేట్ తో రానున్న వకీల్ సాబ్ !

దసరాకి అప్ డేట్ తో రానున్న వకీల్ సాబ్ !

Published on Oct 11, 2020 8:55 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ డైరెక్షన్లో చేస్తున్న వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. కేవలం పది రోజులు షూట్ చేస్తే.. ఈ సినిమా పూర్తయిపోతోంది. అందుకే ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలనేది దిల్ రాజు ప్లాన్. షూట్ లో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఎలాగూ 2021 జనవరి నాటికి థియేటర్లు తెరుస్తాయని స్పష్టమవుతోంది. అందుకే దిల్ రాజు ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పెద్ద ఎత్తున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దసరాకి అధికారికంగా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం.

మొత్తానికి సంక్రాంతి సూపర్ స్పెషల్‌గా పవన్ సినిమా ఉండబోతుంది. ఇక పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. సినిమా బాగుంది అని రిపోర్ట్స్ బయటకు వస్తే మాత్రం.. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ. అలాగే పవన్ శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ ఆశ కూడా ఈ సినిమాతో తీరుతుంది. ఇక ఈ సినిమాలో మంచి ఎమోషన్ తో పాటు మెసేజ్ కూడా ఉండటం సినిమాకి బాగా ప్లస్ కానుంది.

తాజా వార్తలు