పవన్ కోసం స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తయిందట ?

పవన్ కోసం స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ పూర్తయిందట ?

Published on Apr 17, 2020 1:00 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం ఓ స్క్రిప్ట్ రాస్తున్నాడని.. పవన్ కూడా తన 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబంధించిన ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు.. లాక్ డౌన్ తరువాత పవన్ ను కలిసి స్క్రిప్ట్ చెప్పబోతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా పై ఫ్యాన్స్ బాగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్ని ఈ సినిమాలో ఉంటాయనే నమ్మకం ఉంది.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు