మెగాస్టార్ చిరంజీవి హీరోగా తన శకాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇండస్ట్రీకు తన తమ్ముడు కళ్యాణ్ బాబును సరిగ్గా ఇదే రోజు అక్టోబర్ 11న వెండితెరకు పరిచయం చేసి తెలుగు ఇండస్ట్రీ కు ఒక సరికొత్త మరియు ప్రత్యేకమైన హీరోను అందించారు. అక్కడ నుంచి పవన్ చేసిన ప్రాజెక్టులు ఒక్కొక్కటి యూత్ లో సెన్సేషన్ గా మారి కళ్యాణ్ బాబు కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారాడు..
అలాగే పవన్ నుంచి ఎన్నో ఏళ్ల పాటు భారీ ప్లాపుల్లో ఉన్నప్పటికీ కూడా పవన్ క్రేజ్ పెరుగుతూనే వచ్చింది తప్పితే ఏమాత్రం తగ్గకుండా నేటికీ ఆ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. తన మొదటి సినిమాకు జస్ట్ వందల్లో మాత్రమే రెమ్యునరేషన్ తీసుకొని ఇపుడు రోజుకు కోటిన్నర వరకు తీసుకోగలిగే హీరోగా మారాడు.
ఇదొక్కటి చాలదా పవన్ యుఫోరియా తెలుగు సినిమా ప్రస్థానంలో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో చెప్పడానికి. అలా పవన్ తన మొదటి సినిమా నుంచి కూడా ఇప్పటి వరకు తనదైన ఫ్యానిజంని ఏర్పరచుకొని ఈ అక్టోబర్ 11ను “వరల్డ్ పవనిజం డే” గా జరుపుకుంటున్నారు. ఇపుడు ఇదే ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.