ఫస్ట్ లుక్ తో అలరిస్తోన్న ‘వకీల్ సాబ్’ !

ఫస్ట్ లుక్ తో అలరిస్తోన్న ‘వకీల్ సాబ్’ !

Published on Mar 2, 2020 5:08 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ ‘పింక్’ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఈ సాయంత్రం 5 గంటలకు విడుదల అయింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘వకీల్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేశారు. ఇక పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఫుల్ గడ్డంతో వెలికిలా పడుకుని చేతిలో బుక్ తో వెరీ స్టైలీష్ లుక్ లో కనిపించారు. అభిమానులు అంచనాలను ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందుకుని సినిమా పై ఆసక్తిని మరింతగా పెంచింది.

కాగా పవన్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. ఇది ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో ఒకటిగా నిలిచేలా ఉంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు. ఈ రీమేక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

తాజా వార్తలు