పోటుగాడు టీజర్ కు మంచి స్పందన

పోటుగాడు టీజర్ కు మంచి స్పందన

Published on Jul 12, 2013 2:40 AM IST

Potugadu
మంచు మనోజ్ నటిస్తున్న ‘పోటుగాడు’ సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధంగావుంది. మనోజ్ తన ట్విట్టర్లో ఒక పాట టీజర్ ను పోస్ట్ చేసాడు. తమిళ నటుడు సింభు పాడినఈ పాటలోని క్యాచీ లిరిక్స్ నెట్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆడియో త్వరలో విడుదలకానుంది కానీ ఈలోపే టీజర్ వార్తలలో నిలిచింది. ‘ప్యార్ మే పడిపోయా’ అంటూ సాగే మనోజ్ పాడిన మరో పాట ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పవన్ వాడేయార్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. ఈ చిత్రాన్ని రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష – శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో సిమ్రన్ కౌర్ ముండి, సాక్షి చౌదరి, అను ప్రియ మరియు రచెల్ మొత్తం నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. చక్రి మరియు అచ్చు సంగీతాన్ని అందించారు

తాజా వార్తలు