పోటుగాడికి సీడెడ్ లో సాలిడ్ బిజినెస్

పోటుగాడికి సీడెడ్ లో సాలిడ్ బిజినెస్

Published on Sep 16, 2013 11:00 AM IST

Potugadu
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా మంచి కమర్షియల్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా సీడెడ్ ఏరియాలో సాలిడ్ బిజినెస్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఇప్పటివరకూ సుమారు 49.75 లక్షలు కలెక్ట్ చేసింది. మనోజ్ కెరీర్ లో ఇది వరకూ సినిమాతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అమౌంట్. మనోజ్ నటించిన ‘బిందాస్’ సినిమా ఇదే ఏరియాలో మొత్తంగా సుమారు 50 లక్షలు కలెక్ట్ చేసింది.

పొలిటికల్ సమస్యలు ఉన్నప్పటికీ అన్ని ఎరియాల్లోనూ ఈ చిత్ర కలెక్షన్స్ బాగున్నాయి. ప్రస్తుత కలెక్షన్స్ దృష్ట్యా ఈ మూవీ కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కి తాము పెట్టిన డబ్బుతో పాటు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. పోటుగాడు కన్నడలో హిట్ అయిన ‘గోవిందాయ నమః’ సినిమాకి రీమేక్. పవన్ వడియార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి లగడపాటి శ్రీధర్ నిర్మాత. హై ఎంటర్టైన్మెంట్ మరియు అచ్చు మ్యూజిక్ ఈ సినిమా విజయానికి బాగా హెల్ప్ అయ్యింది.

తాజా వార్తలు