ఈ వారం విడుదలయ్యే సినిమాలు వాయిదా పడబోతున్నాయా?

ఈ వారం విడుదలయ్యే సినిమాలు వాయిదా పడబోతున్నాయా?

Published on Dec 18, 2012 12:25 PM IST

nnn
ఈ వారం విడుదల తెలుగు బాక్స్ ఆఫీసు వద్ద సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. కానీ అందులో కొన్ని మాత్రమే విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా రవితేజ, కాజల్ అగర్వాల్, రిచా గంగోపాధ్యాయ ప్రధాన తారాగణంగా వస్తున్న ‘సారొచ్చారు’ డిసెంబర్ 21న విడుదల కాబోతుంది. తమిళ్లో ‘కుమ్కి’ పేరుతో వచ్చిన చిత్రాన్ని తెలుగులో ‘గజరాజు’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ సినిమా కూడా డిసెంబర్ 21 విడుదల కానుంది. ఈ రెండు చిత్రాల విడుదలలో ఎలాంటి మార్పు లేదు. టీవీ యాంకర్ నుండి దర్శకుడిగా మారిన ఓంకార్ మొదటి సినిమా జీనియస్ కూడా ఈ వారమే విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. విశాల్, త్రిషా జంటగా వస్తున్న ‘వేటాడు వెంటాడు’, అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ చిత్రాలు కూడా ఈ వారమే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలు వాయిదా పడటం వల్ల సారొచ్చారు సినిమాకి బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు