పూలరంగడు తూర్పు గోదావరి కలెక్షన్స్

పూలరంగడు తూర్పు గోదావరి కలెక్షన్స్

Published on Feb 21, 2012 1:58 PM IST


సునీల్ నటించిన ‘పూలరంగడు’ చిత్రానికి తూర్పు గోదావరి జిల్లాకు గాను మొదటి మూడు రోజులకు 35 లక్షల 11 వేల 352 రూపాయల (35,11,352/-) షేర్ దక్కించుకుంది. ఈ వసూళ్లు ఇలాగె కొనసాగితే 70 నుండి 80 లక్షల రూపాయల వరకు వసూలు చేయొచ్చు అని భావిస్తున్నారు. మంచి కామెడీ మరియు కథనం వేగంగా సాగడం, సునీల్ డాన్సులు మరియు ఫైట్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పూలరంగడు అన్ని ఏరియల్లోను మంచి వసూళ్లు సాధిస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతోంది.

తాజా వార్తలు