టాలీవుడ్ లో కొన్నాళ్ల కితం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో అదరగొట్టిన స్టార్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. మరి పూజా హెగ్డే హీరోయిన్ గా మళ్ళీ కొంత కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై బిజీగా మారింది. అయితే ఎక్కువగా తమిళ్ లోనే సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే రీసెంట్ గానే ‘రెట్రో’ సినిమాలో సూర్య సరసన కనిపించింది. ఇక ఇవి కాకుండా తమిళ్ లోనే కూలీ, ఇంకా జన నాయగన్ లాంటి భారీ సినిమాల్లో కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే.
మరి ఈ ప్రాజెక్ట్ లు కాకుండా మరో సాలిడ్ ప్రాజెక్ట్ ని ఆమె పట్టేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీని ప్రకారం పూజా హెగ్డే నెక్స్ట్ హీరో ధనుష్ సరసన కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. ధనుష్ లేటెస్ట్ గా కుబేర తో హిట్ కొట్టాడు అలాగే తన హిందీ సినిమా ఒకటి పూర్తి చేసుకున్నాడు. మరి ఫైనల్ గా తన నెక్స్ట్ సినిమా కోసం కూడా సిద్ధం అవుతుండగా అందులో పూజా నటించనున్నట్టు ఇపుడు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.