విడుదల తేదీ : జూలై 04, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : నవీన్ చంద్ర, డా. కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర, తదితరులు.
దర్శకుడు : మదన్ దక్షిణామూర్తి
నిర్మాత : కిషోర్ గరికపాటి
సంగీతం : శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ : టి వినోద్
ఎడిటర్ : శరత్ కుమార్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
వరుస సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరిస్తూ వస్తున్న టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సినిమానే “షో టైం”. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సూర్య(నవీన్ చంద్ర) అలాగే శాంతి (డా. కామాక్షి భాస్కర్ల) హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ లో సింపుల్ లైఫ్ సాగిస్తారు. అయితే ఓ రాత్రి తమ అపార్ట్మెంట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి టెర్రస్ పై సరదా అంత్యాక్షరి ఆడుకునే సమయంలో ఆ ఏరియా సీఐ లక్ష్మీ కాంత్ (రాజా రవీంద్ర) కి సూర్య, తన భార్య లతో చిన్న గలాటా జరుగుతుంది. దీనితో వారిని ఎలాగైనా ఇరికించాలని సీఐ ట్రై చేస్తాడు. ఈ క్రమంలో సరిగా మరునాడు ఉదయం శాంతి ఊహించని విధంగా ఓ హత్యకు యాక్సిడెంటల్ గా కారణం అవుతుంది. మరి ఈ ఊహించని టర్న్ ని సూర్య ఎలా హ్యాండిల్ చేసాడు? వీరి సమస్యలోకి వచ్చిన లాయర్ వరదరాజులు (నరేష్) వల్ల ఏమైంది? చివరికి ఈ హత్య నుంచి బయట పడ్డారా లేదా ఈ సస్పెన్స్ కి ఎలా తెర పడింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఇటీవల నవీన్ చంద్ర నుంచి చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి కానీ ఇది వాటికి కొంచెం భిన్నమైన థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఉన్న తక్కువ రన్ టైంలో డీసెంట్ ట్రీట్ ని తను అందించాడు. ఫస్టాఫ్ వరకు ఒకలా వెళ్లిన సినిమా సెకండాఫ్ ఇంకొంచెం టోన్ మారి ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసేలా కొనసాగుతుంది.
జెనరల్ సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కామెడీ వర్కౌట్ అవ్వదు కానీ ఇందులో బాగా వర్కౌట్ అయ్యింది. ఒక పక్క కామెడీ ఇంకో పక్క సస్పెన్స్ ను దర్శకుడు మైంటైన్ చేయడం ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో ఈ మూమెంట్స్ బాగున్నాయి. ఇక నటీనటుల్లో నవీన్ చంద్ర చాలా బాగా చేసాడు. సింపుల్ లుక్స్ కథకి డిమాండ్ చేసిన విధంగా పలికించి ఆకట్టుకున్నాడు.
ఇక టాలెంటెడ్ నటి కామాక్షి కూడా తన రోల్ లో బాగా చేసింది. తన మార్క్ నాచురల్ పెర్ఫార్మన్స్ ని ఈ సినిమాలో కూడా చూపించింది. ఇంకా నెగిటివ్ పాత్రలో రాజా రవీంద్ర తన విలనిజాన్ని చూపించారు. ఇక నటుడు నరేష్ ఎంటర్ అయ్యిన తర్వాత నుంచి కథనం మరో మలుపు తిరుగుతుంది అని చెప్పవచ్చు.
తన ఎంట్రీ నుంచి తన నటన కామెడీ టైమింగ్ లతో కథనాన్ని హిళేరియస్ గా తీసుకెళ్లారు. అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి తన నుంచి మరో వెరీయేషన్స్ తో సూపర్బ్ గా చేసేసారు. ఇక వీటితో పాటుగా దర్శకుడు ఇచ్చిన హ్యాపీ ఎండింగ్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా సీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్ కి అంత రుచించకపోవచ్చు. ఫస్టాఫ్ అంతా కంప్లీట్ సీరియస్ టోన్ లో నుంచి సెకండాఫ్ లో కామెడీతో కలపడం అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. సో వారి విషయంలో ఈ సినిమా ట్రీట్ ఇవ్వదు. అలాగే సినిమాలో మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ ని దర్శకుడు ఇంకా బలంగా డిజైన్ చేయాల్సింది.
సరదాగా ఉన్న ఇంటి వాళ్ళ దగ్గరకి పోలీస్ లు సింపుల్ గా వెళ్లడం వారితో ఘర్షణ అంత సహజంగా అనిపించవు. అలాగే కొన్ని కొన్ని చోట్ల ముఖ్యంగా ఫస్టాఫ్ లో కథనం కొంచెం సాగదీతగా అనిపించింది. ఇక ఇవి కాకుండా కొన్ని సన్నివేశాలు ఊహాజనీతంగానే అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. జస్ట్ ఒక రోజు లోనే జరిగే కథనే కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. శేఖర్ చంద్ర ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు లాంటివి ఏం పెట్టకుండా కేవలం నేపథ్య సంగీతం తోనే నడిపించారు. అలాగే టి వినోద్ రాజా ఇచ్చిన సినిమాటోగ్రఫీ, శరత్ కుమార్ ల ఎడిటింగ్ వర్క్స్ బాగున్నాయి.
ఇక దర్శకుడు మదన్ దక్షిణామూర్తి విషయానికి వస్తే.. తను ఎంచుకున్న కథకి దాదాపు న్యాయం చేకూర్చారని చెప్పవచ్చు. ఎక్కడో ఒకటీ రెండు చోట్ల తప్పితే తను అనుకున్న ఫన్ సస్పెన్స్ డ్రామాని మంచి ఎమోషన్స్ తో ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే కొన్ని లాజిక్స్ ని కూడా పాటించి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ గా తన వర్క్ బాగుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘షో టైం’ ఒక ఫన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు. అలాగే నరేష్ వచ్చిన తర్వాత నుంచి కథనం ఎంటర్టైనింగ్ గా మారింది. ఒక డీసెంట్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమాలు ఇష్టపడే వారికి షో టైం ఆకట్టుకోవచ్చు. కానీ సీరియస్ థ్రిల్లర్ లవర్స్ ని మాత్రం ఇది ఆకట్టుకోదు. సో కొంచెం ఆలోచించి ట్రై చేస్తే ఈ సినిమా సింపుల్ ఎంటర్టైనర్ గా వీకెండ్ కి నిలుస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team