సమీక్ష : సోలో బాయ్ – స్లో నెరేషన్ అయినా ప్లాట్ మెప్పిస్తుంది

విడుదల తేదీ : జూలై 04, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేతా అవస్థి, పోసాని కృష్ణ మురళి, అనితా చౌదరి తదితరులు
దర్శకుడు : పి.నవీన్ కుమార్
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
సంగీతం : జుడాహ్ సంధి
సినిమాటోగ్రఫీ : త్రిలోక్ సిద్ధు
ఎడిటర్ :ప్రవీణ్ పూడి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

‘బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బాయ్’ నేడు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో ఈ రివ్యూ లో చూద్దాం.

కథ :

మధ్య తరగతి కుటుంబానికి చెందిన కృష్ణ(గౌతమ్ కృష్ణ) ఇంజనీరింగ్ కాలేజీ లో చేరుతాడు. అక్కడ ప్రియ(రమ్య పసుపులేటి)ని ప్రేమిస్తాడు. చదువు అయిపోయాక కృష్ణకు తక్కువ జీతం తో ఉద్యోగం వస్తుంది. దీంతో అతడికి ప్రియ బ్రేకప్ చెబుతుంది. కట్ చేస్తే, లైఫ్ లో ముందుకు వెళ్తున్న కృష్ణ తనతో పాటు పని చేసే శృతి(శ్వేతా అవస్థి)ని ప్రేమిస్తాడు. వారు పెళ్లి కూడా చేసుకుంటారు. అయితే ఓ ఊహించని ఘటన అతడి జీవితాన్ని తారుమారు చేస్తుంది. ఇంతకీ ఆ ఘటన ఏమిటి? దాని వల్ల కృష్ణ శృతి ఎందుకు విడిపోతారు? కృష్ణ జీవితం ఎలా సాగుతుంది? అతడు అనుకున్న గమ్యానికి చేరుకుంటాడా? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూసినట్టు అనిపిస్తుంది. అయినా దీనిని దర్శకుడు ప్రెజెంట్ చేసిన తీరు ఆ విషయాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కథలో ఫక్తు కమర్షియల్ అంశాలు ఎక్కడా మిస్ కాకుండ దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి ఒక చక్కటి పాత్రలో ఆకట్టుకున్నారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా కొడుకు లవ్ ఫెయిల్ అయినప్పుడు తండ్రి ఇచ్చే ధైర్యం చాలా బాగా అనిపిస్తుంది. హీరో గౌతమ్ కృష్ణ యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. ముఖ్యంగా ఆయన ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా ఆకట్టుకుంటారు.

సెకండ్ హాఫ్ లో ఒక మంచి పాయింట్ తో కథను ముందుకు తీసుకెళ్లే తీరు బాగుంది. తన లక్ష్యం కోసం హీరో పడే కష్టాలు కూడా మనల్ని మెప్పిస్తాయి. ఇక ఫైనల్ గా హీరో ఎలా సక్సెస్ అయ్యాడు అనేది బాగా చూపెట్టారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు కథ ఎంత ప్లస్ అయిందో అంతే మైనస్ కూడా అయింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కథ చాలా రొటీన్ గా సాగుతుంది. అందులోనూ కొన్ని ల్యాగ్ సీన్స్ విసిగిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో లవ్ ట్రాక్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది.

హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత ఉన్నా, వాటిని డిజైన్ చేసిన తీరు ఆకట్టుకోదు. ఇక లవ్ స్టోరీలకు సంబంధించిన ఎపిసోడ్స్ కూడా పెద్దగా మెప్పించవు. అయితే, పెళ్లయిన తర్వాత కూడా హీరో అతడి భార్య మధ్య వచ్చే సీన్స్ చాలా రొటీన్‌గా అనిపిస్తాయి.

స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగడంతో ఈ సినిమా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించదు. ఇక మధ్య మధ్యలో వచ్చే ల్యాగ్ సీన్స్ కూడా అంతే. పాటలు వినడానికి బాగున్నా, ప్రేక్షకులకు గుర్తుండేవి కావు. క్లైమాక్స్ ఇంకా బెటర్‌గా రాసుకుని ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు నవీన్ కుమార్ ఈ చిత్రాన్ని మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించాడు. అయితే, కొన్ని పొరబాట్ల కారణంగా ఈ సినిమా ట్రాక్ తప్పింది. స్క్రీన్ ప్లే పై మరింత ఫోకస్ చేయాల్సింది. ఇక ఎడిటింగ్ విషయంలోనూ మేకర్స్ జాగ్రత్తగా ఉండాల్సింది. సంగీతం పరంగా కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. బీజీఎం బాగా వచ్చింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘సోలో బాయ్’ టైటిల్‌కు తగ్గట్లుగానే ఓ మధ్య తరగతి అబ్బాయి కష్టాలను ఎలా ఫేస్ చేశాడనే కాన్సెప్ట్ బాగా చూపెట్టారు. ఫ్యామిలీ కోసం పడే ఆరాటం.. ప్రేమ కోసం చూపే తపన.. రెండింటిలోనూ సరిసమానంగా ప్రెజెంట్ చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్, సెకండాఫ్‌లోని కంటెంట్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. అయితే, రొటీన్ ప్లాట్, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ వంటి అంశాలు ఈ చిత్రానికి మైనస్ అయ్యాయి. ఓ చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని చూడాలనుకునేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూస్తే బెటర్.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Exit mobile version