ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో నటించిన డీజే – దువ్వాడ జగన్నాధం మంచి హిట్ చిత్రంగా నిలిచింది. పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తూ సందడి చేశాడు. ఇక ఈ సినిమాను కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.
అయితే, ఈ సినిమా కాస్ట్ తాజాగా కలిశారు. దర్శకుడు హరీష్ శంకర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్, పూజా హెగ్డేతో పాటు సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ ఒక చోట కలిసి సందడి చేశారు. దీనికి సంబంధించి పూజా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పెట్టింది. ‘డీజే రీ-యూనియన్.. అల్లు అర్జున్ నువ్వు ఎక్కడున్నావ్..?’ అంటూ ఆమె పోస్ట్ చేసింది.
దీనికి రిప్లైగా బన్నీ ‘నెక్స్ట్ టైమ్ తప్పకుండా కలుద్దాం’ అంటూ కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుతం వీరి సోషల్ మీడియా ఇంటరాక్షన్ నెట్టింట వైరల్ అవుతోంది.