బుకింగ్స్ షురూ చేసిన వీరమల్లు.. గెట్ రెడీ ఫర్ రికార్డ్స్!

బుకింగ్స్ షురూ చేసిన వీరమల్లు.. గెట్ రెడీ ఫర్ రికార్డ్స్!

Published on Jul 22, 2025 4:05 PM IST

టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అయింది.

ఇక ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌ను కొద్దిసేపటి క్రితమే ఓపెన్ చేశారు. దీంతో అభిమానులు ఈ సినిమాను తొలిరోజు తొలి ఆటకే చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఇలా టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో, అప్పుడే టికెట్స్ బుక్ చేస్తూ అభిమానులు సందడి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మరికొద్ది గంటల్లో పూర్తిస్థాయి టికెట్ బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి.

ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు