సేతుపతి చిత్రం రిలీజ్ కోసం పూరి రిస్క్ చేస్తాడా..?

సేతుపతి చిత్రం రిలీజ్ కోసం పూరి రిస్క్ చేస్తాడా..?

Published on Jul 23, 2025 12:00 AM IST

Puri Jagannadh

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ కాంబినేషన్ చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను వైవిధ్యమైన కంటెంట్‌తో పూరి తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాకు ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. అయితే, డిసెంబర్‌లో చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.

డిసెంబర్ 5న ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రంతో వస్తున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 19న వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అవతార్ 3’ రిలీజ్ అవుతుంది. వీటితో పాటు అఖండ 2 కూడా డిసెంబర్‌లో రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇన్ని సినిమాల మధ్య పూరి తన ‘బెగ్గర్’ సినిమాను రిలీజ్ చేసేందుకు రిస్క్ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంలో పూరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు