అక్షయ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా.. ?

అక్షయ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా.. ?

Published on Apr 19, 2020 11:06 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుత హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ‘పూజా హెగ్డే’నే. అయితే పూజా ఇటు టాలీవుడ్ లో వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూనే, అటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండీ’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా పూజా నటిస్తుందనుకున్నారు అందరూ. అయితే ‘పూజా హెగ్డే’ది కూడా మెయిన్ రోల్ నేట. కృతి సనన్ కంటే పూజా హెగ్డేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట.

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ప్రస్తుతం చాలా సక్సెస్ ఫుల్ స్టార్ గా ఉన్నాడు. అలాంటి హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే.. బంపర్ ఆఫరే.. ఏమైనా అదృష్టం అంటే ‘పూజా హెగ్డే’దే. ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రభాస్ కు జోడీగా ‘జాన్’ సినిమాలో కూడా నటిస్తోంది. పైగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాతో పాటు పలువురు స్టార్ హీరోలతో కూడా ఈ అమ్మడు ఈ సంవత్సరంలో నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఫిల్మ్ వర్గాల నుండి లీకులు వచ్చేశాయి. మరి అక్షయ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ స్టార్ డమ్ తెచ్చుకుంటుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు