టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ పై పోలీస్ కేసు

bellamkonda-suresh

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లం కొండ సురేష్ మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు. రాధాకృష్ణ అనే ఫైనాన్సియర్ మనీ లావాదేవీల విషయంలో తన మీద చెయ్యి చేసుకున్నాడని ఫిర్యాదు చేసాడు. ఐ.పి.సి లోని మూడు సెక్షన్స్ కింద ఈ కేసుని బుక్ చేసారు. బెల్లంకొండ సురేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సిద్దార్థ్ ‘జబర్దస్త్’, నాగ చైతన్య – సునీల్ సినిమా, అలాగే ఎన్.టి.ఆర్ తో చేయనున్న సినిమా లైన్లో ఉన్నాయి. ఇప్పటికే పలుసార్లు వివాదాలలో ఇరుక్కున్న బెల్లంకొండ ఈ విషయం పై అధికారికంగా ఇంకా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు.

Exit mobile version