అందరిని భయపెట్టనున్న పొగ : ఆనంద్ రంగ

అందరిని భయపెట్టనున్న పొగ : ఆనంద్ రంగ

Published on Sep 18, 2012 8:00 PM IST


శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” ప్రేక్షకులను భయపెట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రాచుర్యం ఉన్నా కూడా తెలుగులో చాలా తక్కువగా హారర్ చిత్రాలు వస్తుంటాయి. గతంలో రామ్ గోపాల్ వర్మ “దెయ్యం “, “భూత్” మరియు “ఫూంక్” వంటి చిత్రాలతో ప్రేక్షకులను భయపెట్టారు. కొద్ది సంవత్సరాల క్రితం తెలుగులో ఓషో తులసి రాం “మంత్ర” ప్రేక్షకులను భయపెట్టింది. ఇందులో చార్మీ కథానాయికగా నటించింది. ప్రస్తుతం “పొగ” అనే పేరుతో శంకర్ మార్తాండ్ హారర్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నవదీప్,మధు శాలిని, రన్దీర్, మరియు బిందు మాధవి లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఒకానొక నిర్మాత అయిన ఆనంద్ రంగ “పొగ ప్రతి ఒక్కరిని భయపెడుతుంది అంతేకాకుండా భయం ఎంత భయంకరమో తెలుపుతుంది” అని ట్వీట్ చేశారు. గతంలో ఈ చిత్రాన్ని కొన్ని స్క్రీన్స్ మీద 4డిలో విడుదల చేయ్యనున్నారని వార్తలు వచ్చాయి. కాని ఈ చిత్ర బృందం ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తుంది. జయనన్ విన్సెంట్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ లో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకొని రాబోయే ఏడాది విడుదల కానుంది.

తాజా వార్తలు