“వ్యాట్ నుండి చిత్రాలను మినహాయించండి” – దాసరి అభ్యర్ధన


తెలుగు చిత్రాలను వ్యాట్ నుండి మినహాయించమని దాసరి నారాయణ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తమ నటుడిగా(మేస్త్రి చిత్రానికి) నంది పురస్కారం అందుకున్న ఈయన మాట్లాడుతూ ” చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కష్ట కాలంలో నడుస్తుంది ఒకటి రెండు చిత్రాలు తప్పుడు కలెక్షన్లు చూపించడం మూలాన అదే నిజమనుకొని రాష్ట్ర ప్రభుత్వం చిత్రాల మీద భారీగా పన్నులు వేస్తున్నారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం చిత్రాల మీద సేవా పన్ను ఎత్తి వేసింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్ నుండి చిత్ర పరిశ్రమను మినహాయించమని కోరారు. మన ప్రక్క రాష్ట్రాలయిన తమిళ నాడు,కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో చిత్ర పరిశ్రమ మీద వ్యాట్ లేదు” అని అన్నారు. దీనికి స్పందనగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయం గురించి ప్రభుత్వం తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారు.

Exit mobile version