‘ప్రేమ కథా చిత్రమ్’ ఈ నెల 24న రానుందా ?

‘ప్రేమ కథా చిత్రమ్’ ఈ నెల 24న రానుందా ?

Published on May 20, 2013 12:11 PM IST

Prema-katha-chitram

సుధీర్ బాబు హీరోగా నటించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాని కొద్దిరోజులకు ముందు జూన్ లో విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. కానీ తాజా సమాచారం.ప్రకారం ఈ సినిమా మే లోనే విడుదలకానుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ పెద్ద సినిమాలు విడుదలకాకపోవడంతో ఈ నెల 24న ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. నందిత హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఈ సినిమాకి ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫిని కూడా అందించారు. ‘ఈ రోజుల్లో’ఫేం మారుతీ ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించారు. జె.బి సంగీతాన్ని అందించిన ఈ సినిమాని సుదర్శన్ రెడ్డి – మారుతీ లు కలిసి నిర్మించారు.

తాజా వార్తలు