మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చేసిన భారీ చిత్రం “కింగ్డమ్” రిలీజ్ కి దగ్గరకి వస్తుండగా హైప్ కూడా బాగా బిల్డప్ అవుతూ వస్తుంది. ఇక అభిమానులు సినిమా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుండగా లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరి ఇందులో విజయ్ తన మార్క్ యునిక్ నెస్ తో ఆకట్టుకుంటున్నాడు. తన మీసకట్టు, కొత్త హెయిర్ స్టయిల్, చేతిలో గన్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసాడు. దీనితో తన కొత్త మాస్ లుక్ ఫ్యాన్స్ లో కేజ్రీగా మారింది.
ఇక కింగ్డమ్ విషయానికి వస్తే ఇదే పోస్ట్ లో గౌతమ్ యాక్షన్ డ్రామాని ఎలా ప్రమోట్ చెయ్యాలి అనిరుద్ స్కోర్ తో అంటూ పోస్ట్ చేసాడు. దీనితో ఇక కింగ్డమ్ ప్రమోషన్స్ షురూ చేస్తున్నట్టే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తుండగా ఈ జూలై 31న తెలుగు, తమిళ్ హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.