మన తెలుగు సినిమా దగ్గర తమ స్వయంకృషితో పైకి వచ్చిన హీరోలు ఎవరు అంటే వారిలో అలనాటి తారలు మినాహా మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, నాచురల్ స్టార్ నాని లాంటి వారి పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. మరి వీరిలో ఒకొకరిది ఒకో సక్సెస్ పాఠం అని చెప్పవచ్చు. ఇలా మాస్ మహారాజ రవితేజ విషయానికి వస్తే.. తనపై ఓ ఫ్రేమ్ మంచి ఎమోషనల్ మూమెంట్ గా మారింది అని చెప్పవచ్చు.
చిన్న చిన్న పాత్రలు, సినిమా అవకాశాలు కోసం చూసిన రవితేజ ఇప్పుడు తను సృష్టించుకున్న సామ్రాజ్యం తన పేరిట నిర్మించిన థియేటర్ లో సగటు ప్రేక్షకుడిగా తన సినీ ప్రయాణ ప్రపంచం ముందు కనిపిస్తున్నారు. ఇది మాత్రం తన అభిమానులు ఒక ప్రత్యేకమైన భావిద్వేగపూరిత మూమెంట్ గా మారింది. ఇలా ఈ స్పెషల్ పిక్ మాత్రం వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం రవితేజ నుంచి రాబోతున్న మాస్ ప్రాజెక్ట్ ‘మాస్ జాతర’ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.