ఫోటో మూమెంట్: ‘జైలర్ 2’ సెట్స్ లో నెల్సన్ కి రజినీ ట్రీట్

ఫోటో మూమెంట్: ‘జైలర్ 2’ సెట్స్ లో నెల్సన్ కి రజినీ ట్రీట్

Published on Jun 21, 2025 4:55 PM IST

ప్రస్తుతం కోలీవుడ్ ఆడియెన్స్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “జైలర్ 2” అనే చెప్పవచ్చు. పార్ట్ 1 మన దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక అనౌన్సమెంట్ తో కూడా ఎనలేని హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుంది.

ఇలా సాగుతున్న నేపథ్యంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పుట్టినరోజు రాగా సినీ ప్రముఖులు చాలామంది తనకి విష్ కూడా చేశారు. ఇక తన పుట్టినరోజుని తలైవర్ సెట్స్ లోనే చేయడం ఇప్పుడు మంచి ఫోటో మూమెంట్ గా మారింది. జైలర్ సినిమాలో తలైవర్ కనిపించిన అదే లుక్ లో రజినీ కనిపిస్తుండగా నెల్సన్ కి కేక్ కట్ చేయించి తినిపించారు. దీనితో ఈ పిక్స్ ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు షేర్ చేయగా ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి. ఇక ఈ వేడుకలో స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా జాయిన్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు