ఫోటో మూమెంట్ : ప్రధాని మోదీతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన భార్య ఉపాసన కొణిదెల తో కలిసి శనివారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగి ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL)కు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరించారు. ఇక ఈ APL విజయవంతంగా ముగిసిన క్రమంలో ఈ భేటీ చోటుచేసుకుంది. మొదటి సీజన్‌ నుంచే ఈ లీగ్ విశేష ఆదరణ అందుకుంది.

ఈ భేటీపై రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. “మోదీ గారి క్రీడలపై ఉన్న ప్రేరణ, మార్గదర్శకత్వం ప్రపంచవ్యాప్తంగా ఆర్చరీ క్రీడను కాపాడి, మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే లీగ్‌లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడిని అభినందించారు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’, గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. పుణెలో ప్రస్తుతం చరణ్-జాన్వీపై పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ మార్చి 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version