కన్నడ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి రూపొందించిన ప్రెస్టీజియస్ చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటింది.
దీంతో ఈ మూవీ టోటల్ రన్‌లో ఎలాంటి భారీ ఫిగర్స్ నమోదు చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ వీకెండ్ కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నోటబుల్ చిత్రాలు లేకపోవడంతో ఈ వారం కూడా ప్రేక్షకులు ఈ సినిమాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా కర్ణాటకలో ఫాస్టెస్ట్ రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూరు నిర్మించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.