హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’ దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాను దర్శకుడు జేన్స్ నాని డైరెక్ట్ చేస్తుండగా హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, శివ బొమ్మక్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా కట్ చేశారు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఆయన నుంచి వచ్చే కామెడీ సినిమాకే హైలైట్ కానుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ డోస్‌లతో కిరణ్ అబ్బవరం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తుండగా నరేష్, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి