ఫోటో మూమెంట్: హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వంగా కలిశారు. ఇటీవల సజ్జనార్ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరు సజ్జనార్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.

పుష్పగుచ్ఛం అందించిన చిరు సజ్జనార్‌తో కొంతసమయం గడిపారు. గతంలో సైబరాబాద్ సీపీగా సజ్జనార్ ఉన్నప్పుడు, కరోనా సమయంలో ఇరువురు కలిసి పలు అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version