ఫోటో మూమెంట్ : ‘రాజాసాబ్’ హీట్ మోడ్‌ను సిద్ధం చేస్తున్న థమన్-మారుతి

ఫోటో మూమెంట్ : ‘రాజాసాబ్’ హీట్ మోడ్‌ను సిద్ధం చేస్తున్న థమన్-మారుతి

Published on Jun 11, 2025 8:30 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్‌ను మేకర్స్ రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్ర టీజర్ డేట్‌ను వారు అనౌన్స్ చేశారు. జూన్ 16న రాజా సాబ్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ టీజర్‌కు మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు థమన్. ఈ టీజర్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్న వారు ఫన్ మోడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలో రాజా సాబ్ హీట్ మోడ్ రానుందని.. అందుకే తాము ఇప్పుడే ఫన్ మోడ్‌ను ఎంజాయ్ చేస్తున్నామని మారుతి ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు.

ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు